హల్లెలూయా అని పాడి స్తుతిపను రారే జనులారా మనసారా ఊరూరా -Halleluyaa ani paadi stuthimpanu raare janulaara manasaara ooroora song lyrics
హల్లెలూయా అని పాడి స్తుతిపను
రారే జనులారా మనసారా ఊరూరా
1. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని
కూడు గుడ్డలనిచ్చి - పోషించు దేవుడని ||2||
తోడు నీడగా నిన్ను కాపాడు నాధుడని ||2||
పూజించి ... పూజించి - పాటించి - చాటింప రారే హల్లెలూయా || హల్లెలూయా ||
2. తాత ముత్తాతల కన్నా - ముందున్న దేవుడని
తల్లి తండ్రులకన్నా - ప్రేమించు దేవుడని ||2||
కల్లాకపటము లేని - కరుణాసంపన్నుడని ||2||
పూజించి ... పూజించి - పాటించి - చాటింప రారే హల్లెలూయా || హల్లెలూయా ||
3. బంధుమిత్రులకన్నా - బలమైన దేవుడని
అన్నాదమ్ములకన్నా - ప్రియమైన దేవుడని ||2||
కన్నబిడ్డలకన్నా - కన్నుల పండుగని ||2||
పూజించి ... పూజించి - పాటించి - చాటింప రారే హల్లెలూయా || హల్లెలూయా ||
4. రాజాధిరాజులకన్నా - రాజైన దేవుడని
నీచాతి నీచులను ప్రేమింప వచ్చెనని ||2||
నిన్నా నేడు ఏకరీతీగా ఉన్నాడని ||2||
పూజించి ... పూజించి - పాటించి - చాటింప రారే హల్లెలూయా || హల్లెలూయా ||
Halleluyaa ani paadi stuthimpanu
raare janulaara manasaara ooroora
1. Paadi pantalanichi - paalinchu devudani
koodu guddalanichi - poshinchu devudani ||2||
thodu needaga ninnu kaapaadu naadhudani ||2||
Poojinchi ... Poojinchi - Paatinchi- Chaatimpa rare Halleluyaa ||Halleluyaa||
2. Thatha muthathala kanna - mundunna devudani
thalli thandrula kanna - preminchu devudani ||2||
kallakapatamu leni - karunaa sampannudani ||2||
Poojinchi ... Poojinchi - Paatinchi- Chaatimpa rare Halleluyaa ||Halleluyaa||
3.Bandhumithrula kanna - balamaina devudani ||2||
annadammula kanna - priyamaina devudani
kannabiddala kanna - kannula pandugani ||2||
Poojinchi ... Poojinchi - Paatinchi- Chaatimpa rare Halleluyaa ||Halleluyaa||
4. Raajadhi rajula kanna - raajaina devudani
neechathi neechulanu premimpa vachenani ||2||
ninna nedu eka ritheega vunnadani ||2||
Poojinchi ... Poojinchi - Paatinchi- Chaatimpa rare Halleluyaa ||Halleluyaa||
Comments
Post a Comment